Home Page SliderTelangana

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను మే 20న హైదరాబాదులో నిర్వహించబోతున్నారు. దీనికై జూనియర్ ఎన్టీఆర్ సహా ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరికీ ఆహ్వానాలు ఇచ్చారు. ఏప్రిల్ 28న విజయవాడలో బాలకృష్ణ  ఎన్టీఆర్ శతజయంతుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. అప్పుడు ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు ఆహ్వానాలు అందలేదు. సీనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి టీడీపీ కార్యక్రమాలకు మొదటి నుండీ చంద్రబాబు కాస్త దూరం పెడుతూనే ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా చూడొద్దని, కుటుంబసభ్యులందరికీ ఆహ్వానం ఉంటుందని టిడిపి నేత టిడి జనార్థన్ పేర్కొన్నారు. గతంలోనే హైదరాబాద్ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని ఈయన తెలిపారు. చంద్రబాబు కుటుంబం, ఎన్టీఆర్ కుటుంబం ఒకే వేదికపై కలుస్తారా, జూనియర్ ఎన్టీఆర్ వీరితో కలుస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. తెలుగుదేశం పార్టీ పరంగా ఆలోచిస్తే, మే లో మహానాడు కార్యక్రమం ఉంటుంది. ఖమ్మంలో ఎన్టీఅర్ కృష్ణుడి విగ్రహం విగ్రహావిష్కరణ కూడా ఉంటుంది. దీనికి కూడా జూనియర్ ఎ న్టీఆర్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానం అందింది. మరి ఎన్టీఆర్ దేనికి హాయజరవుతారో వేచి చూడాల్సిందే.