“ది కేరళ స్టోరీ” మూవీ కలెక్షన్ల సునామీ
“ది కేరళ స్టోరీ” ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో వివాదాలను,కోర్టు కేసులను దాటుకుంటూ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ది కేరళ స్టోరీ” సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమా విడుదలై 10 రోజులు కూడా కాకముందే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి..అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్‌లో చేరిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ సినిమా ఈ ఏడాది హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. కాగా ఈ సినిమాకి పలు రాష్ట్రాలు పన్ను మినహాయింపు ప్రకటించాయి. అయితే మరికొన్ని రాష్ట్రాలు(పశ్చిమ బెంగాల్) మాత్రం ఈ సినిమాని నిషేదించాయి. దీంతో “ది కేరళ స్టోరీ” చిత్ర యూనిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా ఈ సినిమాని ఎందుకు నిషేదించారో చెప్పాలని సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి నోటీసులు కూడా జారీ చేసింది.