Home Page SliderNational

ప్రాంతాల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు, ఓల్డ్ మైసూర్‌లో కాంగ్రెస్ దూకుడు

బెంగళూరులో 28 స్థానాలకు గాను కాంగ్రెస్ 12, బీజేపీ 15, జేడీఎస్ నేతలు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. ముంబై కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 18, జేడీఎస్ రెండు స్థానాల్లో ముందజంలో ఉన్నాయి. ఇక ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యత కనబర్చుతున్నారు. ఇక కోస్తా కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ 4, బీజేపీ 14, ఇతురులు ఒక స్థానంలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. సెంట్రల్ కర్నాటకలో కాంగ్రెస్ 12, బీజేపీ 9, జేడీఎస్ ఒక స్థానంలోనూ, ఇతరులు మరో స్థానంలోనూ లీడ్‌లో ఉన్నారు. హైదరాబాద్ కర్నాటక ఏరియాలో 40 స్థానాల్లో కాంగ్రెస్ 25, బీజేపీ 10, జేడీఎస్ 3, ఇతరులు రెండో చోట్లు ఆధిక్యత కనబర్చుతున్నారు. ఇక ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ పట్టు కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అద్భుత ప్రదర్శన చూపెడుతోంది. మొత్తం 64 స్థానాల్లో కాంగ్రెస్ 38 చోట్ల ఆధిక్యంలో ఉండగా, జేడీఎస్ 19, బీజేపీ 4 చోట్ల, ఇతరులు మూడు చోట్ల ముందంజలో ఉన్నారు.