రాజశ్యామల యాగంలో జగన్
ఏపీ సీఎం జగన్ ఆధ్యాత్మిక బాట పట్టారు. విజయవాడలో జోరుగా యాగాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. గతంలో కేసీఆర్ చేసిన రాజశ్యామల యాగం చేయబోతున్నారు జగన్. దీనితో మళ్లీ అధికారం కోసమే ఈ పూజలు చేస్తున్నారనే వదంతులు బయలుదేరాయి. కేసీఆర్ లాగానే రెండవసారి కూడా అధికారం సాధించడానికి దైవబలం కోసం ఈ హోమాలు చేస్తున్నారని గుసగుసలు మొదలయ్యాయి. శతసహస్ర అష్టోత్తర శతకుండ, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ యాగాలను చేయబోతున్నారు. జగన్ సంకల్పం చేసి, ఈ శ్రీలక్ష్మీ యజ్ఞం ప్రారంభమయ్యింది. ఈ హోమాలు ,యజ్ఞాలకు పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఐదు రోజులపాటు ఈ యజ్ఞాలు జరుగుతాయని యజ్ఞకర్త తెలియజేశారు. ఈ హోమాలు రాష్ట్రప్రజల సంతోషం కోసం, రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి, ముఖ్యమంత్రి చేపట్టారని పేర్కొన్నారు. చివరి రోజైన ఐదవరోజు కూడా జగన్ పూర్ణాహుతిలో పాల్గొంటారని తెలియజేశారు.