పవన్ కళ్యాణ్ పొత్తులతోనే ముందుకెళ్తారా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో పలువురు ఇతర పార్టీ అధినేతలతో భేటి అయిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ ఈసారి పొత్తులు పెట్టుకుని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ..ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే పొత్తుల కోసం పార్టీలను ఒప్పిస్తామని తెలిపారు. కాగా జనసేన పార్టీ ద్వారా 2019లోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టామన్నారు. గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటి చేశామని చెప్పారు. ఆ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో గెలిచి వుంటే ఇప్పుడు బలంగా ఉండేవాళ్లమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మరి ఈ పొత్తులు ఎవరితో పెట్టుకుంటున్నారో అన్న విషయంపై పవన్ కళ్యాణ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

