Home Page SliderNational

 మణిపూర్‌లో క్షణక్షణం ‘భయం భయం’గా స్థానికులు

ఇప్పటికీ భయం గుప్పిట్లోనే ఉన్నారు మణిపూర్‌లోని సామాన్యప్రజలు. అక్కడ గిరిజనులు-గిరిజనేతరుల మధ్య  గొడవ కారణంగా 8 జిల్లాలలో హింసాకాండ చెలరేగిన సంగతి మనకు తెలిసిందే. దాదాపు 5 రోజుల అనంతరం అక్కడ కర్ఫ్యూను కాస్త సడలించారు. దీనితో నిత్యావసర సరుకుల కోసం ప్రజలు మార్కెట్లకు క్యూలు కట్టారు. ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకూ ఈ కర్ఫ్యూను సడలించారు. దీనితో భారీగా జనం రోడ్ల పైకి వచ్చారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటి వరకు ఈ హింసాకాండకు 60 మంది బలి అయ్యారు. రాష్ట్రంలోని 1700 ఇళ్లను దహనం చేశారని ముఖ్యమంత్రి బిపిన్ సింగ్  వెల్లడించారు.  

కర్ఫ్యూ అనంతరం సైన్యం మార్చ్‌ను నిర్వహించింది. పది వేల మందికి పైగా    మిలటరీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పారామిలటరీ సిబ్బంది భారీ ఎత్తున నగరాలలో మొహరించారు. అయితే ఇంటర్నెట్ సదుపాయం ఇంకా పునరుద్ధరించలేదు. మణిపూర్‌లోని మెజారిటీ మైతి కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో చేర్చే అంశాన్ని వ్యతిరేకిస్తూ గిరిజనులు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. 2017లో బిపిన్ సింగ్ ముఖ్యమంత్రిగా  అధికారంలోకి వచ్చినప్పటినుండి గిరిజనుల హక్కులకు ఆయన వ్యతిరేకంగా ఉన్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2022లో తిరిగి మైతీ మెజారిటీ వర్గం కారణంగా మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.