మహేష్‌బాబు “మహర్షి”కి నాలుగేళ్లు
సూపర్ స్టార్ మహష్‌బాబు నటించిన మహర్షి సినిమా విడుదలై నేటికి నాలుగేళ్లు పూర్తవుతోంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. కాగా 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో స్నేహం గొప్పతనాన్ని,రైతు కష్టాన్ని గురించి చూపించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా 3 నేషనల్ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా పూజాహేగ్దే నటించగా..అల్లరి నరేష్ మహేష్ బాబుకు స్నేహితుడిగా కన్పించారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.