Andhra PradeshHome Page Slider

పవన్ కల్యాణ్ కలిస్తే ఎందుకు భయం?

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన రజినీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శలపై మండిపడ్డారు చంద్రబాబు. తాను పవన్ కల్యాణ్, రజినీకాంత్ కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రజినీకాంత్ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి ఏపీలో లేదా అన్నారు చంద్రబాబు? ఇదేమైనా నార్త్ కొరియానా, నువ్వేమైనా కిమ్‌వా అంటూ జగన్‌ను దుయ్యబట్టారు. రజినీకాంత్, జగన్ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా, అసలు వైసీపీ నేతలకు బుద్ధి, జ్ఞానం ఉందా అన్నారు చంద్రబాబు. మీ ప్రభుత్వం బాలేదని ఒక్క మాటైనా అన్నాడా..! నువ్వేమైనా చేయలేదా అన్నాడా? అంటూ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్, సినీ ఇండస్ట్రీలో తనకు లైఫ్ ఇచ్చారని, ఆయన లిఫ్ట్ ఇస్తే సినిమాల్లో నిలదొక్కుకున్నాని రజినీకాంత్ చెప్పారన్నారు.

హైదరాబాద్ గురించి రజినీకాంత్ చెప్పారని… హైటెక్ సిటీ చూస్తే, హైదరాబాదా, న్యూయార్కా అని అంటే మీకేం బాధ అని ప్రశ్నించారు. హైటెక్ సిటికీ ఎవరు ఫౌండేషన్ వేశారని చంద్రబాబు నిలదీశారు. వైసీపీ నేతలు ఎందుకు అనవసర విషయాలు మాట్లాడతారన్నారు. మర్యాద లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ నేతల తీరుతో తెలుగుజాతికి అవమానమన్నారు. జపాన్ వెళ్తే, రజినీకాంత్ సినిమా చూస్తామని ఆ దేశ ప్రజలు చెబుతారన్నారు. ఇండియాకు, ఇంటర్నేషనల్ మార్కెట్‌ను పరిచయం చేసిన వ్యక్తి రజినీకాంత్ అన్నారు. అలాంటి వ్యక్తిని ఇష్టానుసారం మాట్లాతారా అంటూ దుయ్యబట్టారు. అడ్డమొస్తే ఏమైనా అంటారంటూ ఆక్షేపించారు.

పవన్ కల్యాణ్‌ను కలవొద్దా.. మీరెందుకు బాధపడతారన్నారు. ఓడిపోతామని డిసైడయ్యారా.. ఓడిపోతామని కంపరం పుడుతోందా అంటూ ప్రశ్నించారు. ఒకసారి ఓడిపోతే దేశం వదిలిపెట్టపోవాలని, కొందరు సెటిల్ చేసుకుంటున్నారన్నారు. కొందరు ఇప్పటికే కాడి పడేశారన్నారు. రీజనల్ కోర్డినేటర్ పదవి కూడా వద్దంటున్నారన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.