Home Page SliderNational

నడిరోడ్డుపై మంత్రి దౌర్జన్యం

 రుషికేశ్‌లో ఉత్తరాఖండ్‌ ఆర్థికమంత్రి ప్రేమ్‌చంద్ నడిరోడ్డుపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. కారుకు అడ్డొచ్చారని ఇద్దరు యువకులను తన గన్‌మెన్లతో కలిసి చితకబాదారు. ముందుగా చెంపపై కొట్టిన మంత్రి, వారు వాగ్వాదానికి దిగడంతో పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన రుషికేశ్ ప్రధాన రహదారిపైనే జరిగింది. స్థానికులపై ఇలా అఘాయిత్యం చేయడంతో అక్కడి వారు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులు ఓపికగా ఉండాలని, ఇలా ప్రజలపై రెచ్చిపోకూడదని హితవు చెప్తున్నారు. ఈ మంత్రివ్యవహారం చాలా విమర్శలకు దారితీస్తోంది.