పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న పవన్‌కళ్యాణ్
జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆయన ఆరోపించారు. పోలవరాన్ని పూర్తి చేయకుండా మరమ్మత్తుల పేరిట రూ.2,030 కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు,రైతుల పక్షాన జనసేన పోరాటం చేస్తుందన్నారు. దీనిలో భాగంగా వచ్చే నెలలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పోలవరాన్ని సందర్శిస్తారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అయితే అదే రోజు సాయంత్రం కొవ్వూరులో బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

