Home Page SliderNational

 పాపం, బావిలో పడిన ఏనుగు

కేరళలో ఓ గున్న ఏనుగు బావిలో పడింది. కేరళలోని మలప్పురంలో ఓ రబ్బర్ ప్లాంటేషన్‌లోని బావి వద్దకు వచ్చిన ఏనుగు బావిలో పడిపోయింది. ఈ బావి నేలకు సమాంతరంగా ఉండడంతో నీటి కోసం వచ్చిందని భావిస్తున్నారు స్థానికులు. ఈ బావి 15 అడుగుల లోతులో ఉంది. పాపం పైకి రాలేక చాలా సేపు అవస్థ పడింది. చివరికి మూడు గంటల విశ్వప్రయత్నం చేసారు స్థానికులు. అది రాలేక పోవడంతో క్రేన్ సహాయంతో ఎట్టకేలకు ఆ ఏనుగును బయటికి తీసారు. ఎండలు దేశవ్యాప్తంగా ఎక్కువ అవడంతో అడవి జంతువులకు త్రాగునీరు కరువయిపోతోంది. అందుకే దగ్గరలోని బావులు, ఊర్లకు పయనమవుతున్నాయి.