Home Page SliderNational

అత్యధిక జాతీయ అవార్డులతో రికార్డు సాధించిన తెలంగాణా

అనేక రంగాలలో పురోగతి సాధించిన రాష్ట్రాలకు కేంద్రం ప్రకటించిన మొత్తం 46 అవార్డుల్లో 13 అవార్డులు గెలుచుకుంది తెలంగాణ రాష్ట్రం. మొత్తం 9 కేటగిరిలలో అవార్డుల ఎంపిక జరగగా, ఏకంగా 8 కేటగిరీ లలో జాతీయఅవార్డులు సాధించి తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. ఈరోజు ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డులు అందచేసారు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము.

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీ లు, జిల్లా పరిషత్ చైర్మన్లు,  తదితర అధికారులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డులు అందుకున్నారు. అత్యధిక అవార్డులు సాధించిన తెలంగాణను అభినందించారు భారత రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు తేనీటి విందు ఇచ్చిన కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి  సునీల్ కుమార్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులతో కలిసి పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్రానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీతలు, అధికారులు.