Home Page SliderNational

నిన్న విడుదలై అప్పుడే OTT లోకి సమంత “శాకుంతలం”

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “శాకుంతలం”. కాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైన విషయం తెలిసిందే. పౌరాణిక కథల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. దీంతో ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే అమెజాన్ ప్రైమ్ దీనిని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మే మొదటివారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ తన క్యూట్ యాక్టింగ్‌తో అందరిని అలరించింది.