రైతన్నకు భరోసా ఈ ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’
రైతులపై అప్పుల భారం పడకుండా ఏపీ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకంగా పేరువచ్చింది. దీనకి “బెస్ట్ ఇన్నోవేషన్ కేటగిరీ”లో అవార్డు లభించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్కు ప్రశంసాపత్రం లభించింది. మనదేశంలో చాలా వస్తువులకు బీమా సౌకర్యం ఉంది. వాహనాలకు, భవనాలకు, వ్యాపారాలకు బీమా వర్తింపజేసుకోవచ్చు. కానీ మనకు అన్నం పెట్టే రైతన్న పంటలకు బీమాలేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టపోతే, ఆనష్టాన్ని రైతులే భరించవలసి ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఉచిత పంటల పథకం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. రైతులకు దీనిద్వారా ఒక్కరూపాయి కూడా ఖర్చు లేకుండా పంటలకు వందశాతం బీమా కల్పిస్తోంది. ఇప్పటి వరకు 44 నెలల్లో 6,784 కోట్ల రూపాయల పరిహారం రైతులకు అందింది. దీనివల్ల పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం పొందవచ్చు.