అంకుశం సినిమాలో రామిరెడ్డి గతే కొడాలి నానికి!
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో అధికార,ప్రతిపక్షాలు పరస్పర విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేగా కొడాలి నాని చేసింది ఏటంటే గుట్కా నమలడం,క్యాసినో ఆడించడం, ఇసుక మాఫియా చేసి హైదరాబాద్కు పంపుకోవడం తప్ప నియోజకవర్గానికి చేసింది ఏమైనా ఉందా? అని దేవినేని ఉమా ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ హయాంలో 9 వేల ఇళ్లను నిర్మిస్తే వాటిని ఎందుకు ప్రజలకు ఇవ్వలేదని దేవినేని ఉమా నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఆ తర్వాత కొడాలి నానికి అంకుశం సినిమాలో రామిరెడ్డి గతే పడుతుందని దేవినేని ఉమా హెచ్చరించారు.

