Home Page SliderNational

త్వరలోనే KGF-3 కూడా రానుందా?

కన్నడ సూపర్ స్టార్ యశ్ KGF సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ KGF సినిమా భారీ  కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది. దీంతో  కన్నడ సూపర్ స్టార్ యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఈ సినిమా ఇచ్చిన భారీ విజయంతో ప్రశాంత్ నీల్ -యశ్ కాంబోలో KGF-2 ను తెరకెక్కించారు. ఇది కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో దుమ్ములేపింది. అయితే ఈ రోజు KGF-2 విడుదలయ్యి సంవత్సరం పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. “మరుపురాని కారెక్టర్లు ,యాక్షన్‌తో KGF-2 ప్రయాణం అద్భుతంగా సాగింది. ఈ సినిమా గ్లోబల్ రికార్డులతోపాటు అనేక హృదయాలను గెలుచుకుంది” అని పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో చివర్లో  అమ్మకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది..నిజంగా నెరవేరిందా ? అంటూ KGF-3 కి సంబంధించి చిన్న హింట్ ఇచ్చినట్లు కన్పిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న KGF సినిమా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.