ఇవాళ 7 గంటలు పాటు హైదరాబాద్‌లో ఆ రూట్లు బంద్
దేశవ్యాప్తంగా ఈ రోజు అంబేద్కర్ జయంతి సంబరాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం ఓ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. కాగా భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా భారీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ చీఫ్ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నేడు ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆష్కరించబోతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఈ మధ్యహ్నం 1 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షల ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా ఈ విగ్రహావిష్కరణ నేపథ్యంలో నేడు NTR గార్డెన్,PV నరసింహరావు మార్గ్,లుంబినీ పార్క్ మూసి ఉంటాయని అధికారులు ఇప్పటికే వెల్లడించారు.

