Home Page SliderInternational

ప్రపంచకుబేరుడు బెర్నాల్డ్ ఆర్నాల్ట్, చెత్తబుట్టలో మస్క్ ఫీట్

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బెర్నార్డ్ ఆర్నాల్ట్, రెండో ర్యాంక్‌లో ఉన్న ఎలోన్ మస్క్‌పై ఆధిక్యాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రపంచంలోనే విలాసవంతమైన వ్యాపారవేత్త ఖరీదైన వస్తువులను విక్రయిస్తూ… నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఐతే టెస్లా ఇంక్ వ్యవస్థాపకుడు ఎలక్ట్రిక్ వాహనాలపై ధరలను తగ్గించడం కూడా ఆస్తుల పతనానికి కారణమని తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం LVMH (మోట్ హెన్నెస్సీ లూయిస్ విట్టన్) సంస్థ అధినేత ఆస్తులు ఒక్కరోజులో $12 బిలియన్లు పెరిగి దాదాపు $210 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది రికార్డు స్థాయిలో ఆదాయం పెరుగుదలగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యాపారజీవితంలో ఇది రెండో అతిపెద్ద ఒక్కరోజులో ఆస్తి పెరుగుదలగా గుర్తించారు.

ఇదే సమయంలో 3.8 బిలియన్ డాలర్లు సంపాదించడంతో మస్క్ ఆస్తుల విలువ 180 బిలియన్ డాలర్లకు చేరింది. లూయిస్ విట్టన్ హ్యాండ్‌బ్యాగ్‌లు, మోయెట్ & చాండన్ షాంపైన్, క్రిస్టియన్ డియర్ గౌన్‌ల నిర్మాత, ప్రస్తుత త్రైమాసిక అమ్మకాల తర్వాత ఆస్తులు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 74 ఏళ్ల ఆర్నాల్ట్ నికర విలువ పెరిగింది. LVMH షేర్లు 444 బిలియన్ యూరోలు. డాలర్లలో 491 బిలియన్ డాలర్లు. మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలలోకి ప్రవేశించి, పారిస్ ట్రేడింగ్‌లో రికార్డు స్థాయికి 5.7% పెరిగాయి.

LVMH షేర్ క్యాపిటల్‌లో 48% వాటాను ఆర్నాల్ట్ కుటుంబం కలిగి ఉంది. ఈ నెల ప్రారంభంలో మస్క్, Amazon.com Inc. జెఫ్ బెజోస్‌తో కలిసి 200 బిలియన్ డాలర్లు దాటిన వ్యక్తుల జాబితాలో చేటు సంపాదించుకున్నారు. అమెరికా బయట వ్యక్తుల్లో ఇంత సంపద కలిగిన మొదటి వ్యక్తిగా ఆర్నాల్ట్ చరిత్ర సృష్టించాడు. LVMH పనితీరు పాండమిక్ లాక్‌డౌన్‌ల నుండి బయటపడిన తర్వాత చైనా దుకాణదారులు నుంచి వచ్చే ఖరీదైన వస్తువులను స్ప్లాష్ చేయడం ద్వారా సంస్థ నడుస్తుంది. అమెరికాలో తప్ప ప్రపంచమంతా ఈ సంస్థ మెరుగైన ఫలితాలనే రాబట్టింది. ఆర్నాల్ట్ డిజైనర్ బట్టలు, ఆభరణాలను విక్రయం ద్వారా ధనవంతుడుగా ఎదిగితే, మస్క్ సంపద ఒకానొక సమయంలో 340 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ మళ్లీ పడిపోయింది.

మస్క్ స్థాపించిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, డిమాండ్‌ను పెంచే ప్రయత్నంలో అమెరికా వ్యాప్తంగా ధరలను భారీగా తగ్గిస్తోంది. స్పేస్‌ఎక్స్‌తో పాటు, మస్క్ ట్విట్టర్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. ఈ త్రైమాసికంలో రెండు సంస్థల్లో నగదు ప్రవాహం సానుకూలంగా మారొచ్చని మస్క్ అంచనా వేస్తున్నారు. ట్విట్టర్ కొనుగోలు తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ బిలియన్ డాలర్ల అప్పులతో కూరుకుపోయింది.