Andhra PradeshNews

పార్టీ ఏదైనా సరే, చేనేత నియోజకవర్గాల్లో వారికే టికెట్లివ్వాలి…!

చేనేత మంత్రిత్వశాఖ చేనేతలకే కేటాయించాలంటూ విజయవాడ, గుణదలలోని దేవాంగ సంక్షేమ భవన మందు పెడన మున్సిపల్ మాజీ ఛైర్మన్ బండారు ఆనందప్రసాద్ అధ్యక్షతన ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆత్మీయ సమావేశం తీర్మానించింది . ఈ సందర్భంగా ఇటీవల ఎమ్మెల్సీగా విజయం సాధించిన పోతుల సునీతను చేనేత నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పరిరక్షణ, సమస్యల పరిష్కారంతోపాటు, అట్టడుగున ఉన్న చేనేత కులాల అభ్యున్నతి కోసం తాను పాటుపడతానన్నారు పోతుల సునీత. నేతన్నలకు మరిన్ని పథకాల అందించేలా సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తామన్న ఆమె, పథకాల రూపకల్పన కోసం ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ బృందాన్ని సీఎం జగన్ వద్దకు తీసుకొని వెళ్తానన్నారు.

పోతుల సునీత వరుసగా మూడుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారని, ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా నుండి ఎమ్మెల్సీగా అవకాశం రావడం.. చేనేతలకు దక్కిన గౌరవమన్నారు పెడన మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బండారు ఆనంద ప్రసాద్. అనేక సమస్యలతో, పలు కారణాలతోనూ అంతరించిపోతున్న చేనేత కళను కాపాడుకోవడం అందరి విధి అన్నారాయన. చేనేత కళ లేని రోజు చేనేతలకు కనీస గుర్తింపు కూడా ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు చేనేత జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో చేనేతలకే అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు కేటాయించాలని, చేనేత మంత్రిత్వశాఖ చేనేత ప్రజాప్రతినిధులకే రిజర్వ్ చేయాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తీర్మానించింది. ఈ కార్యక్రమంలో వివిధ కులాలకు చెందిన చేనేత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కెవి శేషయ్య నేత, పిల్లలమర్రి నాగేశ్వరరావు, గుంటి శ్రీనివాస్ రావు, గోలి ఆనందరావు, చేనేత కవి రాపోలు జగన్ ముఖ్య ఉపన్యాసం చేశారు. చేనేత కులాలు కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలు దిగొస్తాయని చెప్పారు. ఈ ఆత్మీయ సమావేశంలో పప్పు దుర్గా రమేష్, పప్పు పావని, కొల్లి శివ నాగేశ్వర్రావు, పిచ్చుక ఫణికుమార్, బళ్ల సాంబశివరావు, తాటిపర్తి వెంకటేశ్వర్లు , సోమా శేషాద్రి, గుద్దంటి శ్రీనివాస్ రావు, తుమ్మా రవి, పట్నాన మనోజ్ కుమార్, సలా పరమేశ్వర్ రావు, వాసా వీర రాజు, దొంతం శెట్టి సత్యప్రకాష్, పసగాడ సత్యనారాయణ, కోట రాజేష్ , హేమసుందర నాగభూషణం బందు చోడే, దినేష్ బందు చోడే, సునల్ గర్ రాకేష్, మోహన్ లక్ష్మాజీ రావు బందు చోడే, ఆచంట అనసూయ సురేష్, పిల్లి నిర్మల, తదితర వంద మంది కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.