Home Page SliderNational

గవర్నర్ల వైఖరిపై బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ

బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ వ్రాసారు. తాము తమిళనాడు గవర్నర్ రవిపై అసెంబ్లీలో తీర్మానం పెట్టామని, మిగిలిన రాష్ట్రాలలో కూడా ఇలాగే తీర్మానాలు ప్రవేశపెట్టమని కోరారు. ఈ తీర్మానాలను కేంద్రానికి, రాష్ట్రపతికి పంపుదామన్నారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించట్లేదని, నెలల తరబడి పెండింగులో పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాగైతే పాలన అస్తవ్యస్తమవుతుందని, రాష్ట్రప్రభుత్వానికి, గవర్నర్లకు మధ్య సమన్వయం కుదరడం లేదని విమర్శిస్తున్నారు. గవర్నర్లు రాష్ట్రప్రభుత్వాలకు సహకరించడం లేదన్నది ఈ లేఖ సారాంశం. తెలంగాణా ప్రభుత్వం కూడా ఇదే విషయంగా  గవర్నర్ తమిళిసై పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.