Home Page SliderInternational

మియన్మార్‌లో అరాచకం – సొంత పౌరులనే కాల్చి చంపిన సైన్యం

మియన్మార్‌లో సైన్యం జరిపిన వైమానిక దాడిలో 100 మందికి పైగా పౌరులు మరణించారు. మన పొరుగుదేశం మియన్మార్ సైనిక పాలనతో అతలాకుతలం అవుతోంది. వారి దురాగతాలను అడ్డుకొనే వారే లేరు. ఈ పాలనను వ్యతిరేకిస్తూ ఒక గ్రామంలో ప్రజలు చేపట్టిన కార్యక్రమాన్ని ధ్వంసం చేసే లక్ష్యంతో వైమానిక దాడి జరిపింది సైన్యం. దీనితో అక్కడ పలువురు చిన్నారులు, మహిళలు సహా 100 మంది పౌరులు మరణించారు.

2021 ఫిబ్రవరిలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది సైన్యం. ప్రజాస్వామ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించి, సైనిక పాలనను బలపరిచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. విపరీతమైన వైమానిక దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకూ మూడువేలమందిని పొట్టన పెట్టుకుంది. పజిగ్గీ అనే గ్రామంలో సైనిక పాలనను వ్యతిరేకించే ఒక వర్గం గ్రామస్తులు స్థానిక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో 150 పాల్గొన్నారు. ఈ సంగతి తెలిసిన సైన్యం వారిపై వైమానిక దాడికి పాల్పడింది. వారిని వ్యతిరేకించే వారిని చెరసాలలో బంధిస్తున్నారు.