తెలంగాణాలో ముస్లింలకు గుడ్న్యూస్
తెలంగాణా ప్రభుత్వం రంజాన్ మాసంలో ముస్లింలకు తీపికబురు అందించింది. అదేంటంటే రాష్ట్రంలోని పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే 20 వేల కుట్టు మిషన్లను మైనారిటీ కార్పోరేషన్ ద్వారా అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే ముస్లిం మైనారిటీలకు అందిస్తున్న పలు పథకాలు,కార్యక్రమాల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి రూ.8,581 కోట్లు మైనార్టీల సంక్షేమం కోసం వినియోగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో తెలంగాణాలో ఉన్న ముస్లిం మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు