ఏపీకి పట్టిన సైతాన్ చంద్రబాబు: రోజా
ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా మరోసారి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. టీడీపీ,జనసేనకి దమ్ముంటే ఏపీలో ఇంటింటికి వెళ్లి ఏం చేశారో చెప్పగలరా? అని రోజా ప్రశ్నించారు. కాగా రాష్ట్రానికి పట్టిన దరిద్రం,సైతాన్ చంద్రబాబేనని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని రాష్ట్రాన్ని,రూ.1.50లక్షల కోట్ల ఆస్తులను నాశనం చేశారని రోజా ఆరోపించారు. మరోవైపు దేశంలో ఏ సీఎం చేయని విధంగా జగనన్న ప్రజా సర్వే చేయిస్తున్నారని కొనియాడారు. దీంతో ఏపీలోని ప్రజలంతా జగనన్నే మా భవిష్యత్ అని చెబుతున్నారని రోజా వెల్లడించారు. కాగా రోజా వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కనున్నట్లు కన్పిస్తున్నాయి.