నంది అవార్డు కాదు కమ్మ అవార్డు -పోసాని
సినీ రంగంలో ప్రతిష్టాత్మక నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు పోసాని కృష్ణమురళి. అవి నంది అవార్డులు కావని, కమ్మఅవార్డులని వ్యాఖ్యానించారు. సినీ ఇండస్ట్రీలో అవార్డులు కులాల వారీగా,గ్రూపుల వారీగా పంచుకుంటున్నారని అలాంటి కమ్మ అవార్డు తనకు కూడా వచ్చిందని గుర్తు చేసుకున్నారు. అలాంటి అవార్డు తనకు వద్దని ప్రెస్‌మీట్ పెట్టి మరీ తిరస్కరించానని గుర్తు చేసుకున్నారు. ఈ నంది అవార్డు కమిటీలో 12 మంది సభ్యుల్లో 11 మంది కమ్మవారేనని విమర్శించారు. చంద్రబాబు హయాంలో గ్రూపులకే అవార్డుల పంపకాలు జరిగాయన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఫైబర్ నెట్‌లో సినిమా మొదటి రోజే తమకు కావల్సిన సినిమాను డబ్బు చెల్లించి చూడవచ్చన్నారు.