Andhra PradeshHome Page SliderTelangana

సమంత,చైతూ “మజిలీ”కి 4 ఏళ్లు

అక్కినేని నాగచైతన్య,సమంత రూత్ ప్రభు కలిసి నటించిన సినిమా “మజిలీ” కి నేటితో 4 ఏళ్లు పూర్తయ్యాయి. కాగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథా చిత్రం 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇది అప్పట్లోనే రూ.40 కోట్ల షేర్లు రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కాగా “ఏ మాయ చేసావే” సినిమాతో ప్రారంభమైన చైతూ,సామ్ కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంది. దీంతో వీరిద్దరు కలిసి “మనం”, “ఆటోనగర్ సూర్య”, “మజిలీ” సినిమాలో  జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సందర్భంగా సమంత మజిలీ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.