Home Page SliderTelangana

టెన్త్ పేపర్ లీకు అంశాన్ని డైవర్ట్ చేయడానికే బండి అరెస్ట్

సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. టీఎస్పీఎస్సీ నిర్వహణ చేతకాక , నిరుద్యోగులను గోస పెడుతున్న సర్కారు, కనీసం పదో తరగతి పరీక్షల నిర్వహణ చేయలేకపోతోందని దుయ్యబట్టారు. హిందీ పేపర్ లీకేజీ పేరు చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్యే ఈటల. తక్షణం బండి సంజయ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదంతా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చెయ్యడానికే చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుందని… కేసీఆర్ నీ రాజ్యం, ప్రభుత్వం శాశ్వతం కాదని… కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు. తక్షణం TSPSC ని రద్దు చేయాలని… మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. దేశమంతటా డబ్బు ఖర్చు పెడతానని కేసీఆర్ మాట్లాడుతున్నాడంటే… ఎంతగా తెలంగాణ ప్రజలను కొల్లగొట్టారో అర్థం చేసుకోవాలన్నారు.