పోర్న్ స్టార్‌కు అమెరికా కోర్టు షాక్
ట్రంప్‌పై పరువు నష్టం కేసులో ఓడిపోయిన స్టార్మీ డేనియల్స్
ట్రంప్‌కు లీగల్ ఫీజు చెల్లించాలని కోర్టు ఆదేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌పై చట్టపరమైన విజయం సాధించారు. కాలిఫోర్నియాలోని 9వ US సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ద్వారా ట్రంప్ న్యాయవాదులకు లక్షా 21 వేల అమెరికా డాలర్లు అంటే కోటి కంటే ఎక్కువ చెల్లించాలని ఆదేశించింది. ట్రంప్‌పై ఆరోపణలు చేసిన డేనియల్స్ పరువు నష్టం కేసులో ఓడిపోవడంతో కోర్టు ఇలా ఆదేశించింది. ట్రంప్ న్యాయవాదులకు కోర్టు ఆదేశించిన చెల్లింపులలో ఇప్పటికే 4 కోట్లకు పైగా చెల్లించినట్టు తెలుస్తోంది. పోర్న్ స్టార్ డేనియల్స్, మాజీ అధ్యక్షుడిపై పరువు నష్టం దావా వేసి ఓడిపోయింది. ఇద్దరి మధ్య జరిగిన సంబంధాన్ని కప్పిపుచ్చడానికి డేనియల్స్‌కు డబ్బు చెల్లింపులకు సంబంధించి 34 ఆరోపణలపై మాన్‌హాటన్ కోర్టు ట్రంప్‌ను విచారించిన రోజునే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. చెల్లింపులకు సంబంధించిన వ్యాపార రికార్డులను తప్పుదోవ పట్టించినందుకు కోర్టు, ట్రంప్‌పై 34 అభియోగాలు మోపింది. అమెరికా మాజీ అధ్యక్షుడిపై నేరారోపణలు జరగడం ఇదే తొలిసారి.
ధిల్లాన్ లా గ్రూప్‌కు చెందిన ట్రంప్ అటార్నీ హర్మీత్ ధిల్లాన్ ట్విట్టర్‌లోకి వెళ్లి ఆర్డర్ కాపీని షేర్ చేశారు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినందుకు మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు అభినందనలంటూ రాసుకొచ్చింది. ఐతే సివిల్ లిటిగేషన్ అధికారికంగా ట్రంప్ అరెస్టు, న్యూయార్క్‌లో నమోదైన అభియోగాలకు సంబంధం లేదు. ఈ కేసు పూర్తిగా పోర్న్ స్టార్ డేనియల్స్‌కు సంబంధించినది. మొత్తం వ్యవహారంలో ఆమె మౌనంగా ఉండటానికి 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్, లక్షా 30 వేల డాలర్లు చెల్లించాడని చెప్పింది. ఐతే ఈ వ్యవహారాన్ని ట్రంప్ కొట్టిపారేశారు. మొత్తం వ్యవహారంపై మౌనంగా ఉండటానికి పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి తనను బెదిరించాడని డేనియల్స్ ఆరోపణలు చేసి… ట్రంప్‌పై 2018లో దావా వేశారు.

