నేటి నుండి పదో తరగతి పరీక్షలు
ఏపీలో సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.మొత్తం 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.ఏప్రిల్ 18 తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.పరీక్షా సమయం ఉదయం 9:30 నుండి 12:45 నిమిషాల వరకు ఉంటుంది. ఉదయం 8:45 నిమిషాల నుండి 9:30 నిమిషాల వరకు పరీక్ష గదిలో ప్రవేశానికి విద్యార్థులను అనుమతిస్తారు. జిల్లాలను యూనిట్ గా తీసుకొని మొత్తం 26 జిల్లాల నమూనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 3349 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఒక్కొక్క పరీక్ష హాల్లో అత్యధికంగా 24 మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇస్తారు.మాల్ ప్రాక్టీసులను కాపీలను నిరోధించేందుకు మొత్తం 156 ఫ్లయింగ్స్ స్క్వాడ్లను 682 సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించారు.

