Home Page SliderTelangana

TSPSC కేసులో బోర్డు సెక్రటరీ అనితా రామచంద్రన్ విచారణ

ఈరోజు సిట్ ఆఫీసులో TSPSC కేసులో సెక్రటరీ అనితా రామచంద్రన్ విచారణ కొనసాగుతోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో బోర్డు సభ్యుల పాత్రపై సిట్ అధికారులు ఆరాలు తీస్తున్నట్లు తెలుస్తోంది. TSPSC కమిషన్ సభ్యులు మినహా ఈ లీకేజి కేసులో దాదాపుగా అందరి విచారణలు పూర్తయ్యాయి. ఇక పూర్తి విచారణ నివేదిక రావాల్సి ఉంది. పుణె నుండి FSL రిపోర్టు రావాల్సి ఉంది. ఇది వస్తే ఇక విచారణ పూర్తయినట్లే. ఈ నెల 11 వతేదీన వారి నివేదికను కోర్టుకు సమర్పించబోతున్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ ఈమెకు సెక్రటరీగా పనిచేస్తున్నారు. లీకైన గ్రూప్ 1 పేపర్‌ను దొంగిలించి, పరీక్షను రాసాడు ప్రవీణ్. ఈమెను విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు.