InternationalNews

తమంతట తామే నిప్పుపెట్టుకొని సజీవదహనమైన 40 మంది వలసదారులు

అమెరికాలో స్థిరపడాలనే కాంక్షతో, నిరసనలకు పాల్పడిన కొంతమంది వలసదారులు చేసిన పని వారినే కాక ఆ సమూహం మొత్తాన్ని మృత్యుముఖంలో నెట్టింది. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ప్రాంతాల నుండి వచ్చిన 68 మంది వలసదారులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో స్థిరపడాలనే ఆశతో వచ్చారు. ఉత్తర మెక్సికోలోని సియూడడ్ వారెజ్ నగరం అమెరికా సరిహద్దులకు దగ్గరగా ఉండడంతో వారు , సియూడడ్‌లోని తాత్కాలిక శిబిరాలలో ఆశ్రయం పొందుతున్నారు. వారిని అమెరికా పంపే ఏర్పాట్లు జరిగే క్రమంలో, వీసా ప్రక్రియ నేపథ్యంలో  నిర్బంధ కేంద్రంలో వేచి ఉన్నారు.  రెండు రోజుల క్రితం వారిని అమెరికాకు కాకుండా వారి వారి సొంత దేశాలకే పంపిస్తారనే వార్తలు వచ్చాయి.

దీనితో నిరసనలు వ్యక్తం చేశారు. ఆ నిరసనలో భాగంగా సోమవారం రాత్రి తమ పరుపులకు నిప్పు పెట్టారు. అయితే మంటలు వేగంగా శిబిరం మొత్తం వ్యాపించడంతో తప్పించుకోలేక 40 మంది సజీవదహనం అయ్యారు. మరో 28 కూడా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా పలువురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.