1901 తర్వాత ఇండియాలో అంతటి భీకరమైన ఎండ వేడిమి
భారతదేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తోందని సంబరపడిపోతుంటే… పెరుగుతున్న ఎండ వేడిమి, వేడి గాలులు మానవ మనుగడను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఆఫ్రికాలోని సహారా ఏడాది ప్రాంతమంత వేడి ప్రాంతాలు దేశంలో పెరుగుతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. 1901 ఫిబ్రవరి తర్వాత అంతటి అత్యధిక ఉష్ణోగ్రత వచ్చే కొద్ది రోజుల్లో భారతీయులకు తప్పదని జాతీయ వాతావరణ కార్యాలయం అంచనా వేస్తోంది. గతేడాది మించి ఎండలు మండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరెంట్ కోతలు, పంట నష్టం ఎక్కువగా ఉండనుందని పేర్కొంది. 50 డిగ్రీల సెల్సియస్ (122 ఫారెన్‌హీట్) కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు తప్పవంది. గతంలో ఎప్పుడూ భరించలేని విధంగా… 140 కోట్ల జనాభాకు మండే ఎండలు సమస్యగా మారతాయంది. జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో.. ఇరుకు నివాసాల్లో ఉండేవారు ఎక్కువ కష్టాలు పడాల్సి వస్తోందని అభిప్రాయపడింది. గాలి, వెలుతురు లేని ఇళ్లు, కనీసం ఏసీ సౌకర్యం లేని వారి పరిస్థితి దుర్భరంగా ఉంటుందంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు, వాతావరణంలో తేమ తక్కువగా ఉండటం వల్ల ఉక్కపోతకు గురవుతారని చెప్పారు యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్ వాతావరణ శాస్త్రవేత్త కీరన్ హంట్ అన్నారు.