ఎడ్యుకేషన్ మినిస్టర్ వెడ్స్ ఐపీఎస్ ఆఫీసర్
పంజాబ్‌లో అధికార ఆప్ ఎమ్మెల్యేలు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ బెయిన్స్ ,ఐపీఎస్ ఆఫీసర్ జ్యోతియాదవ్ను పెళ్లాడారు. రూపానగర్లోని గురుద్వార్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరింగింది. కాగా పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వచ్చాక సీఎం భగవంత్ మాన్ కూడా వివాహం చేసుకున్నారు. ఇటీవల ఆప్ పార్టీ ఎమ్మెల్యేలు నరిందర్ కౌర్ భారజ్,నరిందర్ పాల్ సింగ్ కూడా వివాహా బంధంలోకి అడుగుపెట్టారు.