Home Page SliderTelangana

తెలంగాణాలో మరో 3 గంటల్లో వర్షాలు

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా మరికాసేపట్లో వర్షాలు కురువనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. అయితే మహబూబాబాద్ ,భూపాలపల్లి,సిద్దిపేట,యాదాద్రి,నల్గొండ,నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడనుందని వెల్లడించింది. ఈ వర్షాల్లో ఈదురు గాలుల వేగం గంటకు 30-40 కి.మీ వరకు ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది. కాగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణాలో 3 రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇవి తేలికపాటి నుంచి మోస్తరుగా కురిసే వర్షాలని కూడా వాతావరణశాఖ పేర్కొంది.