Home Page SliderNational

కాసేపట్లో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్

లోక్‌సభకు అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. గుజరాత్ కోర్టు క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించి, గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత గాంధీ ఎంపీ హోదాను కోల్పోయినట్టు లోక్ సభ సెక్రటేరియట్ నిన్న ప్రకటించింది. అనర్హత వేటు తర్వాత రాహుల్ ట్విట్టర్లో స్పందించారు. భారతదేశం వాయిస్ కోసం పోరాడుతున్నానని… అందుకు మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నానని హిందీలో ట్వీట్ చేశారు. అనర్హత వేటుతో వాయనాడ్ ఎంపీ సీటు ఖాళీ అయింది. “దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది” అంటూ కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ గాంధీ 2019 ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనిపై వివిధ రాష్ట్రాల్లో అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. గాంధీని దోషిగా నిర్ధారించిన సూరత్ కోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేసేందుకు వీలుగా 30 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు తీర్పు తర్వాత రాహుల్ ట్వీట్ ద్వారా తన ఉద్వేగాన్ని పంచుకున్నారు. “నా మతం సత్యం మరియు అహింసపై ఆధారపడింది. సత్యమే నా దేవుడు, దానిని పొందేందుకు అహింస మార్గం” అంటూ మహాత్మా గాంధీని ఉటంకిస్తూ ట్వీట్ చేశాడు.