Home Page SliderInternational

ఇంటెల్ సహవ్యవస్థాపకుడు మృతి

ప్రపంచ టెక్ దిగ్గజం ఇంటెల్ సహవ్యవస్థాపకుడు గోర్డాన్ మూర్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈయన ప్రాసెసర్ల ఉత్పత్తితో టెక్ ప్రపంచంలో విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ ప్రపంచంలో ఉపయోగించే ఎక్కువ శాతం కంప్యూటర్లలో ఇంటెల్ సంస్థకు చెందిన ప్రాసెసర్లనే వాడుతున్నారు. కాగా భవిష్యత్తులో కార్లలో ఆటోమెటిక్ కంట్రోల్స్ ,పోర్టబుల్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ (స్మార్ట్‌ఫోన్)వంటి టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని 1960ల్లోనే మూర్ అంచనా వేశారు. కాగా దీనిని “మూర్స్ లా “గా టెక్ ప్రపంచం పరిగణిస్తుంది.