రాహుల్ గాంధీపై అనర్హత వేటు
కాంగ్రెస్ అగ్రనేతపై వేటు పడింది. మోదీ ఇంటి పేరుతో చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో… రెండేళ్ల జైలు శిక్ష నేపథ్యంలో ఆయనపై అనర్హత పడుతుందా అన్న చర్చ నిన్నటి నుంచి జోరందుకొంది. రాహుల్‌కు సూరత్ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, అప్పీల్ చేయడానికి 30 రోజులు గడువున్నప్పటికీ… కోర్టు ఉత్తర్వుల మేరకు పార్లమెంటు రాహుల్‌పై అనర్హత వేటు పడింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం, పార్లమెంటు సభ్యుడు ఏదైనా నేరానికి పాల్పడి కనీసం రెండేళ్ల జైలు శిక్షకు గురైతే వెంటనే సదరు ప్రజాప్రతినిధిపై అనర్హత వేటు పడుతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో… రెండేళ్ల జైలు శిక్ష నేపథ్యంలో ఆయనపై అనర్హత పడుతుందా అన్న చర్చకు లోక్ సభ సెక్రటేరియట్ ఫుల్ స్టాప్ పెట్టింది. రాహుల్‌కు సూరత్ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, అప్పీల్ చేయడానికి 30 రోజులు గడువున్నప్పటికీ… కోర్టు ఉత్తర్వుల మేరకు పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు వేసింది.

రాహుల్ గాంధీ అనర్హుడు కావడంతో వయనాడ్ నియోజకవర్గాన్ని ఈసీ ఖాళీ అని ప్రకటించనుంది. దీంతో అక్కడ ఎన్నికను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఉన్నత న్యాయస్థానం తీర్పును రద్దు చేయకపోతే, రాహుల్ గాంధీ వచ్చే ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించరు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 499 ప్రకారం గాంధీని దోషిగా నిర్ధారించిన క్రిమినల్ పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష చాలా అరుదు అని నిపుణులు చెబుతున్నారు.