TSPSC లీకేజ్ దర్యాప్తులో దొరికిన క్వశ్చిన్ పేపర్లు
టిఎస్పీఎస్సీ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్‌కు కీలక ఆధారాలు దొరికాయి. ఈ కేసులో ప్రధాన నిందితులు రాజశేఖర్, రేణుకల స్వగ్రామాలలో కూడా విచారణ చేస్తున్నారు సిట్ అధికారులు. రాజశేఖర్ ఇంట్లో సెర్చ్ కొనసాగిస్తున్న అధికారులకు కొన్ని ప్రశ్నాపత్రాలు లభించాయి. ఈ నెల (మార్చి5)న అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రాసిన గోపాల్, నీలేష్ ప్రశ్నాపత్రానికి 14 లక్షలు సమకూర్చినట్లు సమాచారం లభించింది. మరో నింతురాలు రేణుక సోదరుడైన మేడ్చల్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ద్వారా ఆమెకు కూడా కొంత డబ్బు ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగతా డబ్బు విషయంలో జరిగిన గొడవ కారణంగానే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.