తెలంగాణాలో 1540 ఉద్యోగాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణా సర్కార్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఖాళీగా ఉన్న 1540 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్యం వెల్లడించింది. కాగా హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాలలో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లో 323,మేడ్చల్ జిల్లాలో 974,రంగారెడ్డి జిల్లాలో243 పోస్టులు ఉన్నాయి. అయితే వీటిని తెలంగాణా హెల్త్,మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

