Home Page SliderNational

ఆకాశాన్నంటిన బంగారం ధరలు

దేశంలో ఎప్పుడు లేని విధంగా బంగారం ధర చుక్కలను తాకింది. భారతదేశంలో తొలిసారిగా బంగారం ధర రూ.60 వేలు దాటింది. పెరిగిన ధరలతో ఇకపై  సామాన్యులకు బంగారం అందని ద్రాక్షపండులా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం  దేశంలోని ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 వేలు దాటి రికార్టు సృష్టించింది. దీనికి ప్రధాన కారణం ఇటీవల అమెరికా సిలికాన్  వ్యాలీలోని SVC బ్యాంకు షేర్లు భారీగా పతనమవ్వడమే అని తెలుస్తోంది. దీంతో బ్యాంకింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపించడం లేదు. కాగా ప్రపంచవ్యాప్తంగా మదుపర్లు బ్యాంకింగ్ రంగ షేర్ల నుంచి తమ పెట్టుబడులను బంగారంపై పెడుతున్నారు. దీంతో అంతర్జాతీయంగా పసిడికి అనుహ్య రీతిలో డిమాండ్ పెరిగింది.