ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ తప్పనిసరి.. లేదంటే..?
మరికొద్ది రోజుల్లో ఆధార్‌కార్డు, పాన్‌కార్డు లింక్ గడువు తేదీ ముగియబోతోంది. మార్చి 31వ తేదీ సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డులు రెండింటినీ తప్పనిసరిగా లింక్ చేయాలని కేంద్ర సర్కార్ సూచించింది. లేదంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బ్యాంకు లావాదేవీలన్నీ తాత్కాలికంగా నిలిపివేయబడతాయని.. ఆదాయ పన్ను సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ చేసింది. అస్సాం, జమ్మూ, కాశ్మీర్, మేఘాలయ వంటి రాష్ట్రాలు మినహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు పాన్, ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలని, అన్ లింక్ చేయబడిన ఖాతాలన్నీ నిలిపేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రెండింటిని లింక్ చేసుకోండి.