Home Page SliderNational

ఆహార భద్రత, ఆరోగ్యం కోసం మిల్లెట్స్ దివ్యౌషధం-ప్రధాని నరేంద్ర మోదీ

ఆహార భద్రతతో పాటు ఆహారపు అలవాట్ల సవాళ్లను అధిగమించేందుకు మిల్లెట్స్ (తృణధాన్యాలు) సహాయపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేషనల్ ఫుడ్ బాస్కెట్‌లో పోషక-తృణధాన్యాల వాటాను పెంచడానికి కృషి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు. ‘గ్లోబల్ మిల్లెట్స్ సదస్సు’ను ప్రారంభించిన అనంతరం సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇండియా ప్రతిపాదించడం, కృషి వల్ల ఐక్యరాజ్యసమితి 2023ని ‘అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’గా ప్రకటించిందన్నారు. ఇది దేశానికి ఎంతో గర్వకారణమని అన్నారు. మిల్లెట్స్ ఆహార పదార్థాలుగా వినియోగించడాన్ని ప్రపంచ ఉద్యమంగా ప్రోత్సహించేందుకు భారతదేశం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో రసాయనాలు, ఎరువులు లేకుండా మిల్లెట్స్‌ను సులభంగా పండించవచ్చని ప్రధాని చెప్పారు. భారతదేశపు మిల్లెట్ మిషన్ దేశంలోని 2.5 కోట్ల చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.

మిల్లెట్స్ నేషనల్ ఫుడ్ బాస్కెట్ వాటాలో కేవలం ఐదారు శాతమేనన్నారు మోదీ. ఆ వాటాను పెంచడానికి భారతదేశ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు వేగంగా కృషి చేయాలని ఆయన కోరారు. అందుకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకాన్ని ప్రారంభించిందని… మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల ఉత్పత్తిని పెంచడానికి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీలను కోరారు. మిల్లెట్స్ లేదా పోషక-తృణధాన్యాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌ను సృష్టించాలన్నారు. భారతదేశం 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి నాయకత్వం వహించింది.

భారతదేశం ప్రతిపాదనకు 72 దేశాలు మద్దతు ఇచ్చాయి. 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా మార్చి 2021లో ప్రకటించారు. మిల్లెట్స్ చిన్న-విత్తనాల గడ్డిని వర్గీకరించడానికి ఒక సాధారణ పదం, వీటిని తరచుగా పోషక-తృణధాన్యాలు లేదా పొడి నేల-తృణధాన్యాలు అని పిలుస్తారు. జొన్నలు కూడా ఉన్నాయి. పెరల్ మిల్లెట్ (బజ్రా), ఫింగర్ మిల్లెట్ (రాగి), లిటిల్ మిల్లెట్ (కుట్కి), ఫాక్స్‌టైల్ మిల్లెట్ (కాకున్), ప్రోసో మిల్లెట్ (చీనా), బార్న్యార్డ్ మిల్లెట్ (సావా), కోడో మిల్లెట్ (కోడాన్) ఇతర మిల్లెట్లు ఉన్నాయి. భారతదేశం 170 లక్షల టన్నుల కంటే ఎక్కువ మిల్లెట్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇది ఆసియాలో 80 శాతం. ప్రపంచ ఉత్పత్తిలో 20 శాతం. మిల్లెట్ ప్రపంచ సగటు దిగుబడి హెక్టారుకు 1,229 కిలోలు కాగా, భారతదేశంలో దిగుబడి హెక్టారుకు 1,239 కిలోలు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ (IYMI)-2023 సందర్భంగా కస్టమైజ్డ్ పోస్టల్ స్టాంప్, రూ.75 కరెన్సీ కాయిన్‌ను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు.