Andhra PradeshHome Page Slider

ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం జగన్, రేపు మోదీ, అమిత్ షాతో భేటీ

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆయన తాడేపల్లి సీఎం కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి ఏడున్నరక గంటలకు జగన్ ఢిల్లీ చేరుకుంటారు. 1 జనపథ్ నివాసంలో జగన్ రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. జగన్ ఢిల్లీ పర్యటనపై వివరాలు తెలియాల్సి ఉంది. ఐతే జగన్ ఢిల్లీ పర్యటన చాలా ముఖ్యమైనది తెలుస్తోంది. త్వరలో కర్నాటక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో… ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది.