స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం
కర్నూలు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి నాలుగు స్థానిక సంస్థల నియోజకవర్గాలను అధికార వైఎస్సార్సీపీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఆనెపు రామకృష్ణ (108 ఓట్లు)పై వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి నర్తు రామారావు 632 ఓట్ల తేడాతో గెలుపొందారు. పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ విజయం సాధించారు. కవురు శ్రీనివాస్‌కు మొదటి ప్రాధాన్యత ఓట్లు 481 రాగా, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. 988 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉత్తరాంధ్రలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం రావాడినికి 48 గంటలు పట్టే అవకాశం ఉంది. ఆరు జిల్లాలో 2 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. గత మూడు ఎన్నికల్లో ఇక్కడ రెండో ప్రాతినిధ్యం ఓట్లతోనే అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు.

