పద్ధతి మార్చుకోకుంటే ఇంటికి పంపిస్తా.. జగన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మంత్రులు మార్పు కనిపించడం లేదని సొంత శాఖలపై కూడా పట్టు సాధించలేకపోతున్నారని మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్. కొందరు మంత్రులకు వారి వారి శాఖల్లో అసలేం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని ఇలా అయితే చాలా కష్టమని అవసరమైతే పనిచేయని మంత్రులను మార్చేసి ఆ స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తానంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలువురు మంత్రులను ఉద్దేశించి క్యాబినెట్ మీటింగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాక మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయం మొదటి బ్లాకులో మంత్రివర్గ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా మూడు గంటలకు పైగా సాగిన మంత్రివర్గ భేటీలో వివిధ అంశాలపై సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. 45 అంశాలకు సంబంధించి ఈ సందర్భంగా ఆమోదం కూడా తెలిపారు.