Home Page SliderNews AlertTelangana

బండిపై మహిళా కమీషన్‌ ఆగ్రహం.. నోటీసులు జారీ..

లిక్కర్‌ స్కాం వ్యవహారంలో ఈడీ నోటీసు అందుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  ఈ వ్యాఖ్యలపై మహిళా కమీషన్‌ సీరియస్‌ అయింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా సంజయ్‌ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమీషన్‌… ఆ వ్యాఖ్యలపై విచారణ జరపాలని డీజీపీకి ఆదేశించింది. మరోవైపు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రమంతటా నిరసన  కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నేతలు పలుచోట్ల బండి దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో ఆందోళనకు దిగారు. వెంటనే సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని… కవితకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.