టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు
గన్నవరం నియోజకవర్గంలో ఘటనల తర్వాత అరెస్టయిన టీడీపీ నేత పట్టాభికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో పట్టాభికి బెయిల్‌పై విడుదల చేయాలంది. కృష్ణా జిల్లాలో టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత జరిగిన పరిణామాలతో పోలీసులు పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే వంశీ, టీడీపీ కార్యకర్తల మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది. టీడీపీ కార్యాలయంపై దాడి చేయడంతోపాటు… అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. పట్టాభి అరెస్టు తర్వాత పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అరెస్టు తర్వాత, పట్టాభి కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. పట్టాభి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.