భీమవరంలో నడిరోడ్డుపై స్టూడెంట్స్ హల్‌చల్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులు రెచ్చిపోయారు. రెండు వేరు వేరు కాలేజీలకు చెందిన విద్యార్థులు నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా వీరు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సోసైటీ ,సీతా పాలిటెక్నిక్ విద్యార్థులుగా తెలుస్తోంది. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకుని..విద్యార్థులను కట్టడి చేశారు. అయితే విద్యార్థుల మధ్య ఘర్షణకు దారీ తీసిన కారణాలు ఇంకా తెలియాల్సివుంది.

