Home Page SliderNational

ఢిల్లీలో ఫుడ్ డెలివరీ బాయ్‌లకు వింత కష్టం

స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ఏజెంట్లకు ఢిల్లీలో కొత్త కష్టాలు ఎదురయ్యాయి. ఇటీవల ఢిల్లీ సర్కారు బైక్ టాక్సీలపై నిషేధం విధించింది. ఓలా, ఊబర్, రాపిడో వంటి సంస్థలు బైక్ టాక్సీలు నడపడాన్ని నిషేధించింది. ద్విచక్ర వాహనాలను వాణిజ్య అవసరాలకు వినియోగించరాదని పేర్కొంది. రవాణా శాఖ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు వేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుగా అర్థం చేసుకున్న రవాణా శాఖ ఫుడ్ డెలివరీ చేసే సంస్థలకు కూడా ఫైను వేయడం మొదలు పెట్టింది. బైక్ టాక్సీగా భావించి తమ ఏజెంట్‌కు 15 వేల రూపాయలు ఫైన్ పడిందని జొమాటో ఆరోపించింది. ఫుడ్ డెలివరీకి అత్యధికంగా ద్విచక్రవాహనాలనే వాడుతున్నారు. ఆర్ టీఓ అధికారులు తమ వాహనాలకు సైతం చలాన్లు విధిస్తున్నారని స్విగ్గీ, జొమాటో సంస్థలు ఢిల్లీ సర్కారుకు ఫిర్యాదు చేశాయి. ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుగా అర్థం చేసుకున్నారని , వెంటనే స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని కోరుకుంటున్నారు.