News

తొలి సినిమా విడుదల కాకముందే డైరెక్టర్ మృతి

మలయాళ చిత్ర నిర్మాత జోసెఫ్ మను జేమ్స్ ఇక లేరు. దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ తొలి చిత్రం నాన్సీ రాణి విడుదలకు కొన్ని రోజుల ముందు 31 ఏళ్ళ వయసులో మరణించాడు. హెపటైటిస్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని వయసు 31. తొలి చిత్రం ‘నాన్సీ రాణి’ విడుదలకు కొద్ది రోజుల ముందు… దురదృష్టవశాత్తూ ఆయన మరణించాడు. ‘నాన్సీ రాణి’లో జోసెఫ్ మను జేమ్స్‌తో కలిసి పనిచేసిన అజు వర్గీస్, అకాల మరణం గురించి తెలుసుకొని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. “వెంటనే వెళ్ళిపోయావా బ్రదర్. ప్రార్థనలు” అని వర్గీస్ రాశాడు.


జోసెఫ్ తొలి చిత్రంలో నటించిన అహానా కృష్ణ కూడా ఈ వార్తలపై స్పందించింది. “రెస్ట్ ఇన్ పీస్ మను! ఇలా జరగకూడదు నీకు” అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసింది. జోసెఫ్, బాల నటుడిగా వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. సాబు జేమ్స్ దర్శకత్వంలో 2004లో వచ్చిన ‘ఐ యామ్ క్యూరియస్’ చిత్రంలో బాలనటుడిగా పనిచేశాడు. మలయాళం, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.