జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే.. మర్రి రాజశేఖర్
ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా కొందరు విపక్షనేతలు పనిచేస్తున్నారని… అలాంటి వారి ఆటలు ఎక్కువ కాలం సాగబోవన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మర్రి రాజశేఖర్. నాడు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్షాలను ఎలా అణచివేసిందో మరచిపోలేమన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నిరసనలు తెలిపితే కేసులు పెట్టి జైలుకు పంపించేవాళ్లన్నారు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నాయకులు… నిరసనలు, ధర్నాలు చేసుకోగలుగుతున్నారన్నారు మర్రి.

ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మర్రి రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. నాడు జగన్ హామీ ఇచ్చారని.. నేడు అమలు చేశారన్నారు. జగన్ చెప్పాడంటే చేస్తారంతేనన్నారు. పార్టీలో ఎప్పుడూ తనకు జగన్ ప్రయారిటీ ఇచ్చారన్నారు. అవకాశం వచ్చినప్పుడు అన్నీ అమలు చేస్తారని.. కంగారు అక్కర్లేదన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను జగన్ చట్టసభలకు పంపిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారన్నారు మర్రి రాజశేఖర్.

